తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ | Chandra babu Naidu an Balakrishna | Sakshi
Sakshi News home page

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ

Mar 22 2015 2:16 AM | Updated on Aug 29 2018 3:37 PM

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ - Sakshi

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ

ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తాతలయ్యారు.

హైదరాబాద్: ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన వియ్యంకుడు ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తాతలయ్యారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి(బాలకృష్ణ కుమార్తె) శనివారం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు.

తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్లు ఆండాళ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రసవ సమయంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ ఆస్పత్రి వద్దే ఉన్నారు. సీఎం చంద్రబాబు ఉగాది ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లి తన మనవడిని చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement