గందరగోళం ‘బాబు’: నారాయణ | chandra babu is in confusion over telangana, says narayana | Sakshi
Sakshi News home page

గందరగోళం ‘బాబు’: నారాయణ

Nov 29 2013 2:57 AM | Updated on Sep 2 2017 1:04 AM

గందరగోళం ‘బాబు’: నారాయణ

గందరగోళం ‘బాబు’: నారాయణ

ప్రత్యేక తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పలేక టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర గందరగోళపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు.

 సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పలేక టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర గందరగోళపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. తెలంగాణకు అనుకూలమంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఘడియకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఏఐఎస్‌ఎస్ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘ఆయన (బాబు) ఫుల్, హాఫ్ మైండ్‌తో ఉన్నారని’ చమత్కరించారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతం, ఆ తర్వాత సమన్యాయం, ఇప్పుడేమో సమైక్యవాదమా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఇంత అన్యమనస్కత పనికిరాదన్నారు. చంద్రబాబు ధైర్యం లేని నాయకుడని దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తామని ఊరిస్తున్న కాంగ్రెస్ పార్టీ- జనానికి సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా చూపిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement