ఈనెల 23న సీమాంధ్ర (13 జిల్లాల) విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యార్థి జేఏసీ కోఆర్డినేటర్ తులా ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు
తాడేపల్లిగూడెం రూరల్ : ఈనెల 23న సీమాంధ్ర (13 జిల్లాల) విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యార్థి జేఏసీ కోఆర్డినేటర్ తులా ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడించి వారు రాజీనామా చేసే వరకు ఆందోళన చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు వలంటీర్లుగా 5 వేల మంది విద్యార్థులు సేవలు అందించారని పేర్కొన్నారు. ఏపీఎన్‌జీవో భవనంలో జిల్లా విద్యార్థి జేఏసీని రాష్ట్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ డీవీ కృష్ణాయాదవ్ ప్రకటించారని ప్రభాకరరావు తెలిపారు.