ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్‌.. యువరైతు మృతి

Young Farmer Deceased Amid Clash With Haryana Police Khanauri Border - Sakshi

ఢిల్లీ:పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హర్యానా పోలీసులు రైతులపై ప్రయోగించిన టియర్‌ గ్యాస్‌ షెల్లింగ్‌లో యువరైతు మృతి చెందారు. హర్యానా కనౌరీ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

పోలీసులు ప్రయోగించిన టియర్‌ గ్యాస్‌ షెల్‌ తగిలి 24 ఏళ్ల శుభ్‌కరణ్‌ సింగ్ కన్నుముశాడు. తీవ్రంగా గాయపడిన శుభ్ కరణ్ సింగ్‌ను స్థానిక​ ఆస్ప్రతికి  తరలించాగా.. అప్పటికే అతను మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సరిహద్దుల్లో 160 మంది రైతులు గాయపడ్డారని పంజాబ్‌ పోలిసులు తెలిపారు.

రైతులు బుధవారం మళ్లీ పోరుబాట పట్టారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని  డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం చేశారు.

శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై భద్రతా దళాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. డ్రోన్లతో రైతులపైకి టియర్‌ గ్యాస్‌ వదిలారు. దీంతో కొందరు రైతులకు స్వల్ప గాయపడ్డారు. ఈ క్రమంలోనే యువ రైతు శుభ్‌కరణ్‌ సింగ్‌కు హర్యానా పోలీసులు ప్రయోగించిన టియర్‌ గ్యాస్‌  షెల్‌ తగిలి మృతి చెందాడు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top