ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌గా చల్లా మధుసూధన్‌ | Challa Madhusudhan Reddy Appointed As AP Skill Development Corporation Chairman | Sakshi
Sakshi News home page

ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా చల్లా మధుసూధన్‌

Jul 19 2019 9:07 PM | Updated on Jul 19 2019 9:14 PM

Challa Madhusudhan Reddy Appointed As AP Skill Development Corporation Chairman - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా వైఎస్సార్‌ సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తూ, సమాజ అభివృద్ధిపై పరిపూర్ణమైన అవగాహన కలిగివున్న వ్యక్తిగా చల్లా మధుసూదన్ రెడ్డిని ఈ పదవిలో నియమించడం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement