అడ్రస్ అడిగి మహిళ మెడలో చైన్‌స్నాచింగ్ | chain snatching at chandanagar | Sakshi
Sakshi News home page

అడ్రస్ అడిగి మహిళ మెడలో చైన్‌స్నాచింగ్

May 9 2014 8:45 PM | Updated on Aug 30 2018 5:27 PM

అడ్రస్ అడిగి మహిళ మెడలో చైన్‌స్నాచింగ్ - Sakshi

అడ్రస్ అడిగి మహిళ మెడలో చైన్‌స్నాచింగ్

అడ్రస్ అగినట్లు నటించి ఇంటి ముందు శుభ్రపరుస్తున్న ఓ మహిళలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్: అడ్రస్ అగినట్లు నటించి ఇంటి ముందు శుభ్రపరుస్తున్న ఓ మహిళలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ వాసు సమాచారం మేరకు...

శేరిలింగంపల్లి భెల్ ఎంఐజీలో నివాసముండే విజయలక్ష్మి (60) శుక్రవారం ఉదయం తన ఇంటిముందు చెత్తను తొలగిస్తుండగా.. పల్సర్‌పై వచ్చిన ఓ వ్యక్తి విజయ లక్ష్మిని అడ్రస్ అడుగుతూ దృష్టిమరల్చి ఆకస్మాత్తుగా ఆమె మెడలోని పుస్తెలతాడు, హారాన్ని తస్కరించి వేగంతో పరారయ్యాడు. విజయలక్ష్మి తేరుకొని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement