నేడు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన 

Certificate Verification For Government Jobs In Kurnool - Sakshi

అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు, మెసేజ్‌లు

డీపీఓ కేఎల్‌ ప్రభాకర్‌రావు 

సాక్షి, కర్నూలు(అర్బన్‌): గ్రామ, వార్డు సచివాలయ రెండవ విడత పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 28వ తేదీన ఐదు రకాల పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్‌ ప్రభాకర్‌రావు చెప్పారు.  శనివారం ఆయన తన చాంబర్‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, పంచాయితీ కార్యదర్శి గ్రేడ్‌–6 (డిజిటల్‌ అసిస్టెంట్‌) పోస్టులకు మెరిట్, రోస్టర్, రిజర్వేషన్‌ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు, మెసేజ్‌లు పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.

స్థానిక జిలా పరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ – 5, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6 పోస్టులకు వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. అలాగే విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు స్థానిక కలెక్టరేట్‌లోని సెరికల్చర్‌ డీడీ కార్యాలయం రూం నెంబర్‌: 121, 126 గదుల్లో, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జెడ్పీ ప్రాంçగణంలోని డీపీఆర్‌సీ భవనంలో, అలాగే మహిళా పోలీసులకు సంబంధించి కొండా రెడ్డి బురుజు సమీపంలోని ఎస్సీ ఆఫీసు వద్ద సర్టిఫికెట్ల పరిశీలన జరుగతాయన్నారు.

పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5 పోస్టులకు 85 మంది, గ్రేడ్‌–6కు 127, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 1, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 199 మందికి కాల్‌ లెటర్లు ఆయా శాఖలకు చెందిన అధికారులు పంపించడం జరిగిందన్నారు.  కాగా ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 20 శాతం మార్కులను అర్హతగా గుర్తించడం, స్లైడింగ్‌ సిస్టమ్‌లో కేటగిరీ –1లోని ఈ పోస్టుల్లో ఇప్పటికే విధుల్లో చేరిన వారిలో కొందరికి పోస్టులు, ప్లేసులు మారే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ వివరించారు.

కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలన 
స్థానిక జెడ్పీలోని డీపీఆర్‌సీ భవనంలో శనివారం వార్డు అమెనిటీస్‌ సెక్రటరీ, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్‌ లెటర్లు అందిన అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే ఈ నెల 26వ తేదీన జరిగిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరైన వారి కోసం శనివారం కూడా స్థానిక విశ్వేశ్వరయ్య భవన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top