వేడుకగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవం | Celebrate the end of the discussion parinayotsavam | Sakshi
Sakshi News home page

వేడుకగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవం

May 11 2014 1:52 AM | Updated on Aug 25 2018 7:16 PM

వేడుకగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవం - Sakshi

వేడుకగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవం

తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం శనివారం వేడుకగా ముగిసింది. మలయప్పస్వామి తొలిరోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనంపై ఊరేగగా, మూడో రోజైన శనివారం గరుడ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు దంతపల్లకిని అధిరోహించి ప్రదర్శనగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.

తిరుమల: తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం శనివారం వేడుకగా ముగిసింది. మలయప్పస్వామి తొలిరోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనంపై ఊరేగగా, మూడో రోజైన శనివారం గరుడ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు దంతపల్లకిని అధిరోహించి ప్రదర్శనగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. శోభాయమానంగా రూపొందించిన పరిణయోత్సవంపై మూడు రోజుల పాటు స్వామివారు, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతాట, నూతన వస్రాల సమర్పణ చేశారు.

తర్వాత ఉత్సవర్లకు ఆస్థానం, వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలతో కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.కల్యాణవేదిక సమీపంలోనే రంగురంగుల బాణసంచా పేల్చుతూ స్వామికినీరాజనం పలికారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో పోలా భాస్కర్, సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement