రుణాల రీషెడ్యూల్కు హామీ ఇవ్వలేదు : ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ | Cannot guarantee the rescheduling of loans: RBI Deputy Governor | Sakshi
Sakshi News home page

రుణాల రీషెడ్యూల్కు హామీ ఇవ్వలేదు: ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్

Jul 14 2014 6:47 PM | Updated on Aug 24 2018 7:18 PM

ఉర్జిత్ పటేల్ గాంధీ - Sakshi

ఉర్జిత్ పటేల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ మాట దేవుడెరుగు, రుణాల రీషెడ్యూల్‌ సమస్య కూడా మళ్లీ మొదటికొచ్చింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ మాట దేవుడెరుగు, రుణాల రీషెడ్యూల్‌ సమస్య కూడా మళ్లీ మొదటికొచ్చింది. రుణాలు రీషెడ్యూల్‌ చేస్తామని ఆర్బిఐ ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ ఆర్. ఉర్జిత్ పటేల్ గాంధీ స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్‌ విధివిధానాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రీషెడ్యూల్పై పూర్తి వివరాలతో రమ్మని మాత్రమే చెప్పినట్లు తెలిపారు.  రెండు ప్రభుత్వాలకు ఇదే చెప్పినట్లు ఆయన తెలిపారు.

జాతీయ విపత్తుల్లాంటి సందర్భాలలో  మాత్రమే రుణాల రీషెడ్యూల్‌లో బ్యాంకులకు నియమనిబంధనలుంటాయని చెప్పారు. రైతుల రుణాల రీషెడ్యూల్‌  రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ(ఎస్ఎల్బిసి) ఆమోదంతో జరగాలన్నారు.  రుణాల రీషెడ్యూల్‌ కంటే ఇంకేదైనా చేయాలన్నదానిపై ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు గాంధీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement