
'చంద్రబాబు మొదటి నుంచీ అవినీతి పరుడే'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ అవినీతి పరుడేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచీ అవినీతి పరుడేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. కాకపోతే తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కేసులో బయటపడ్డాడని ఆయన అన్నారు. వదిలేయండని ప్రధాని మోదీకి కేసీఆర్ చెబితే తప్ప ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడలేరన్నారు. త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని సి. రామచంద్రయ్య ఈ సందర్భంగా చెప్పారు.