'స్వలాభాల కోసం అన్యాయం చేయొద్దు' | C. Ramachandraiah Slams Chandrababu Naidu over Crop Loan Waiver | Sakshi
Sakshi News home page

'స్వలాభాల కోసం అన్యాయం చేయొద్దు'

Aug 12 2014 2:14 PM | Updated on Sep 2 2017 11:47 AM

'స్వలాభాల కోసం అన్యాయం చేయొద్దు'

'స్వలాభాల కోసం అన్యాయం చేయొద్దు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఫైర్ అయ్యారు.

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఫైర్ అయ్యారు. రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు రిజర్వు బ్యాంకు నిధులు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఈ విషయం తెలియదా అంటూ ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ మీ చేతుల్లో ఉండే ఆర్బీఐకి చెప్పి ఫండ్ రిలీజ్ చేయించాలని సూచించారు. ఏపీకి రాజధాని నిర్మించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయ స్వలాభాల కోసం ప్రజలకు అన్యాయం చేయొద్దని రామచంద్రయ్య కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement