డూడూ బసవన్న.. కూడు కావాలన్నా | bull and his owner face troubles for getting food | Sakshi
Sakshi News home page

డూడూ బసవన్న.. కూడు కావాలన్నా

Jul 22 2015 9:28 AM | Updated on Aug 1 2018 5:04 PM

డూడూ బసవన్న.. కూడు కావాలన్నా - Sakshi

డూడూ బసవన్న.. కూడు కావాలన్నా

సంక్రాంతికి సందడి చేసే బసవన్నకు బువ్వ కరువైంది. పుష్కరాల్లో యజమానితో పాటు యాచిస్తోంది.

సాక్షి, రాజమండ్రి : సంక్రాంతికి సందడి చేసే బసవన్నకు బువ్వ కరువైంది. పుష్కరాల్లో యజమానితో పాటు యాచిస్తోంది. కుమారీ టాకీస్ ఎదురుగా ఈ దృశ్యం కనిపిం చింది. ‘ఇప్పుడెవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమెలా బతకాల. మా కష్టసుఖాల్లో బసవన్నే తోడు. అందుకే ఇలాంటి పండగల్లో మాతోపాటే ఇలా’.. అని వాపోయాడు దాని యజమాని.

వెజి‘ట్రబుల్స్’
కాతేరు (రాజమండ్రి రూరల్) : పుష్కరాల సందర్భంగా కూరగాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పిండ ప్రదాన సమయంలో పురోహితులకు దానం చేసేందుకు భక్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. మార్కెటింగ్‌శాఖ మొబైల్‌రైతు బజార్లను ఏర్పాటు చేసినా భక్తులకు పూర్తిస్థాయిలో అందడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement