
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరాను. నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. రీయింబర్స్‌మెంట్ కోసం రివాల్వింగ్ ఫండ్ నుంచి నిధులు విడుదలయ్యేలా ఏర్పాటు చేయనున్నారు. నాబార్డు ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నప్పటికీ, ఆ నిధుల విడుదలలో జాప్యం లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.