బ్రదర్స్‌.. అదుర్స్‌

Brothers Tallent in Running And Karate - Sakshi

ఒకరు కరాటేలో, మరొకరు రన్నింగ్‌లో ప్రతిభ

పలు పోటీల్లో పతకాలు ప్రశంసాపత్రాలు కైవశం

పశ్చిమగోదావరి, పోడూరు: జిన్నూరు నర్సింహరావుపేటకు చెందిన పెచ్చెట్టి నాగచైతన్య, పెచ్చెట్టి రాధాకృష్ణ సోదరులిద్దరూ చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణిస్తున్నారు. అన్న నాగచైతన్య జిన్నూరు ఐడియల్‌ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడు రాధాకృష్ణ 2వ తరగతి చదువుతున్నాడు. నాగచైతన్య కరాటేలో రాణిస్తూ పలు పతకాలను సాధించాడు. పాలకొల్లు, నిడదవోలు పట్టణాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను, ప్రశంసాపత్రాలను అందుకున్నాడు. రాధాకృష్ణ రన్నింగ్‌లో చిచ్చరపిడుగు. స్కూల్‌స్థాయిలో ఎప్పుడు పోటీలు నిర్వహించినా ఫస్ట్‌ వస్తాడు. ఇటీవల పాలకొల్లులో అపుస్మా ఆధ్వర్యంలో జోనల్‌స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. భవిష్యత్తులో మరింత రాణిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top