ఏపీఎన్జీవో సభలను తరిమికొట్టండి: ప్రభాకర్ | Boycott APNGOs meetings, says Chikkudu Prabhakar | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవో సభలను తరిమికొట్టండి

Sep 6 2013 9:23 AM | Updated on Mar 23 2019 9:03 PM

పెట్టుడిదారులైన ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాసభలను తరిమికొట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా 'సేవ్ ఆంధ్రప్రదేశ్'అంటూ పెట్టుడిదారులైన ఏపీఎన్జీవోల నిర్వహిస్తున్న మహాసభలను తరిమికొట్టాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ శుక్రవారం తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి రేపు అర్థరాత్రి వరకు టీ జేఏసీ బంద్కు పిలుపు నివ్వడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు.తెలంగాణ బంద్కు ఆయన మద్దతు పలికారు.

 

రాజకీయ ఖైదీల నాయకుడు శ్రీరాముల శ్రీనివాస్ కూడా తెలంగాణ బంద్కు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఏపీఎన్జీవోలు ఈ నెల 7న నగరంలోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది.ఆ సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

కాగా ఆ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. అయితే ఆదే రోజు నగరంలో తెలంగాణావాదులు శాంతిర్యాలీ నిర్వహించేందుకు  ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.ఆ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకు నిరసనగా ఈ నెల 7న 24 గంటల బంద్ నిర్వహించాలని టీజేఏసీ తెలంగాణవాదులకు పిలుపు నిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement