ఆంటోనీ కమిటీని కలిసే ఆసక్తి ఉందా? | Botsa satyanarayana says, If anybody interested to meet Antony's committee? | Sakshi
Sakshi News home page

ఆంటోనీ కమిటీని కలిసే ఆసక్తి ఉందా?

Aug 13 2013 6:04 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.

 9581141230కు సమాచారమివ్వండి
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి పనిచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆంటోనీ కమిటీ సభ్యులను కలిసి తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియజేయాలని ఆసక్తి కలిగినవారు ‘‘9581141230’’ మొబైల్ నెంబర్‌కు సమాచారం పంపాలని కోరారు. సమాచారం అందుకున్న తరువాతే ఆంటోనీ కమిటీని ఎక్కడ, ఎప్పుడు కలవాలనే సమాచార సందేశాన్ని సదరు సంఘాలకు తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ, సీమాంధ్రకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్ధి, కార్మిక , ప్రజా సంఘాలతోపాటు కాంగ్రెసేతర పార్టీలు కూడా కమిటీని సంప్రదించవచ్చని సూచించారు. అయితే వ్యక్తులను కాకుండా గ్రూపులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement