రోశయ్యతో బొత్స సత్యనారాయణ సమావేశం | Botsa satyanarayana meets Tamilanadu Governor Rosaiah | Sakshi
Sakshi News home page

రోశయ్యతో బొత్స సత్యనారాయణ సమావేశం

Oct 19 2013 10:22 AM | Updated on Jul 12 2019 3:10 PM

తమిళనాడు గవర్నర్ రోశయ్యతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం విశాఖలో భేటీ అయ్యారు.

విశాఖ : తమిళనాడు గవర్నర్ రోశయ్యతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం విశాఖలో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు విజయనగరంలో నేటి నుంచి కర్ఫ్యూ ఎత్తివేశారు. దాంతో 13 రోజుల నిర్బంధ వెతల నుంచి ప్రజలకు విముక్తి లభించింది. శనివారం ఉదయం నుంచి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేసినట్లు ఎస్పీ కార్తికేయ ప్రకటించారు.

ప్రజలు ప్రశాంతంగా రోడ్లపై తిరగవచ్చునని, కాని పట్టణంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ  స్పష్టం చేశారు.  21, 22, 23 తేదీల్లో పైడితల్లమ్మ పండగ జరగనుండడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement