5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం | bogapuram international airport will plan to built in 5040 ekars says kimidi mrunaali | Sakshi
Sakshi News home page

5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం

Jun 22 2015 12:19 PM | Updated on Sep 3 2017 4:11 AM

5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం

5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుపై అధికారులతో సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని సమీక్ష నిర్వహించారు.

విజయనగరం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుపై గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని సోమవారం అధికారులతో  సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..5040 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 

భూసేకరణ, సమీకరణలో రైతులు దేనికి ముందుకు వస్తే ఆ విధానం లో భూమిని సేకరిస్తామని మృణాళిని తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు విమానాశ్రయం సమీపంలోనే ప్రభుత్వ భూములు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లేని పక్షంలో రాజధాని పరిహారం కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. 9 పంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement