రక్తం ధరలు తగ్గుముఖం | Blood prices declined | Sakshi
Sakshi News home page

రక్తం ధరలు తగ్గుముఖం

Aug 5 2014 3:07 AM | Updated on Apr 3 2019 4:22 PM

రక్తం విక్రయ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర రెడ్‌క్రాస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 శ్రీకాకుళం కల్చరల్: రక్తం విక్రయ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర రెడ్‌క్రాస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పలు సంస్థలు, జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు రక్తం ధరలను తగ్గిస్తూ రాష్ట్ర రెడ్‌క్రాస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడిం చారు.ఇప్పటి వరకు రక్తం ప్యాకెట్టు మామూలుగా రూ.1450, దాత ఉంటే దాన్ని 12 వందల రూపాయలకు అందజేసేవారు. అయితే ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించి విషయాన్ని రాష్ట్ర రెడ్‌క్రాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. కొత్తరేట్ల ప్రకారం రక్తం ప్యాకెట్టు మామూలగా అయితే రూ.1050, దాత ద్వారా అయితే రూ. 900కు అందజేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement