బోర్డు తిప్పేసిన రత్నబాలాజీ చిట్ఫండ్ కంపెనీ | big fraud done by ratnabalaji chitfund company in tadepalligudem | Sakshi
Sakshi News home page

బోర్డు తిప్పేసిన రత్నబాలాజీ చిట్ఫండ్ కంపెనీ

Apr 27 2015 1:46 PM | Updated on Sep 3 2017 12:59 AM

బోర్డు తిప్పేసిన రత్నబాలాజీ చిట్ఫండ్ కంపెనీ

బోర్డు తిప్పేసిన రత్నబాలాజీ చిట్ఫండ్ కంపెనీ

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఓ చిట్ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఓ చిట్ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. సుమారు రూ.6కోట్లతో చిట్ఫండ్ కంపెనీ నిర్వాహకుడు రాంబాబు పరారయ్యాడు. చర్లంచల్ల రాంబాబు గత కొన్ని సంవత్సరాలుగా రత్నబాలాజీ చిట్స్ నడుపుతున్నాడు. స్థానికులకు నమ్మకం కుదరటంతో అతని వద్ద చిట్స్ వేయటం మొదలుపెట్టారు.

అయితే చిట్ పాడిన వారికి రాంబాబు డబ్బు ఇవ్వకుండా రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నాడు. 15 రోజులుగా చలంచర్ల రాంబాబు కనిపించకుండా తిరుగుతుండటంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కాగా, రాంబాబు తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement