కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యగా ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు, పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.