ఈ ఏడాది సంక్రాంతి పండగ ప్రతి ఇంటా సిరిసంపదలు కురిపించాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆకాంక్షించారు.
విజయనగరం కంటోన్మెంట్: ఈ ఏడాది సంక్రాంతి పండగ ప్రతి ఇంటా సిరిసంపదలు కురిపించాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ పండగను ఘనంగా జరుపుకోవాలని, అందరికీ ఈ సంక్రాంతి శుభం కలిగించాలన్నారు. విద్యాపరంగా మంచి మార్కులతో అందరూ ఉత్తీర్ణత సాధించాలన్నారు. రైతులు వేసిన పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాలన్నారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంగీత సాహిత్య, సాంస్కృతిక పరంగానూ, క్రీడల్లోనూ బాగా రాణించి జిల్లా పేరు, ప్రతిష్టలు ఇనుమడించేలా అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సఫలీకృతులు కావాలని కలెక్టర్ నాయక్ ఈ సందర్భంగా అభిలషించారు.