చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు | Been found in the case of sexual assault about it | Sakshi
Sakshi News home page

చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు

Jun 19 2014 1:35 AM | Updated on Jul 23 2018 9:13 PM

వరుసకు చెల్లెలైన బాలికను ప్రేమపేరుతో మోసగించి పలుమా ర్లు లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రూ రల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

నూజివీడు రూరల్ : వరుసకు చెల్లెలైన బాలికను ప్రేమపేరుతో మోసగించి పలుమా ర్లు లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రూ రల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. స్థా నిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ కె.వి.సత్యనారాయణ ఈ విషయాన్ని తెలియజేశారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతారామపురానికి చెందిన పి.అశోక్ (24) వ రుసకు చెల్లెలు, స్థానికురాలైన బాలిక(16)కు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెబుతూ పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాల వారు ఇద్దరినీ మందలించాడు.

ఈక్రమంలో అశోక్ బాలికపై మరోసారి లైంగికదాడి చేసేందుకు ఈనెల 15న మాయమాటలు చెప్పి ఆటోలో ఏలూరు తీసుకువెళ్లాడు. దీనిపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎస్.రామకృష్ణ కేసు న మోదు చేశారు. సీఐ సత్యనారాయణ దర్యాప్తు నిర్వహించారు. నిందితుడిని బుధవారం అరె స్టు చేశామని సీఐ చెప్పారు.
 
విద్యార్థినిపై లైంగికదాడి కేసులో ముగ్గురి అరెస్టు
 
పెనమలూరు : మైనర్ అయిన ఇంటర్మీడియెట్ విద్యార్థిని కిడ్నాప్, లైంగికదాడి కేసులో ము గ్గురు నిందితులను పెనమలూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన బాలి క విజయవాడ శివారులోని కానూరులో గల ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. మచిలీపట్నానికి చెందిన వాకా నాగేశ్వరరావు, మరికొందరు గతనెల 31న కాలేజీకి వచ్చారు.

ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లారు. దీనిపై ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలిక హైదరాబాద్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను తీసుకువచ్చా రు. వాకా నాగేశ్వరరావు హైదరాబాద్ తీసు కువెళ్లి తనతో శారీరకంగా కలిశాడని బాలిక ఇ చ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. దీంతో ై నాగేశ్వరరావు లైంగిక దాడి చేసినట్లుగా కూడా పోలీసులు కేసులో మార్పులు చేశారు. ఈ మేర కు నాగేశ్వరరావుతోపాటు మచిలీపట్నానికి చెందిన కె. వాకాలయ్య, హైదరాబాద్‌కు చెం దిన జి.మధుబాబును అరెస్టు చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement