కర్నూలు:
బార్ కోడ్ విధానం ద్వారానే మద్యం విక్రయాలు జరపాలని వ్యాపారులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆదేశించారు. మద్యం వ్యాపారంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ ఏడాది కొత్తగా 2డీ బార్ కోడింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం వ్యాపారులు ఈ విధానం అమలుపై అయిష్టత వ్యక్తం చేస్తూ రాష్ట్రస్థాయి యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈనెల 15వ తేదిలోగా హోలోగ్రామ్ ప్రాజెక్టును ఖచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్.రావత్ ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆరు నెలల క్రితమే అధికారులకు ఈ ప్రాజెక్టు అమలుపై మార్గదర్శకాలు అందిన సంగతి తెలిసిందే. గురువారం జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను మద్యం వ్యాపారులను కార్యాలయానికి రప్పించి ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సుర్జీత్‌సింగ్, హనుమంతరావు, ఏఈఎస్ హెప్సిబారాణి, కర్నూలు సీఐ పద్మావతితో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రతి మద్యం దుకాణంలో 2డీ స్కానర్, ఇండస్ట్రియల్ కంప్యూటర్, 3జీ సిమ్, ప్లాట్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా వ్యాపారులకు ఇన్చార్జి డీసీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 194 మద్యం దుకాణాలు, 30 బార్లు ఉన్నాయి.
అన్ని దుకాణాల్లో కూడా బార్కోడ్ విధానం ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి 2డీ బార్‌కోడింగ్ పద్దతిలోనే విక్రయాలు జరగనున్నాయి. ఈ విధానం అమలు వల్ల జిల్లాలోని మద్యం డిపోతో పాటు రీటైల్ దుకాణాల్లో విక్రయాల స్టాక్ వివరాలు, హైదరాబాద్ సెంట్రల్ సర్వర్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
‘బార్కోడ్' విధానంతోనే మద్యం విక్రయాలు
Published Fri, Nov 7 2014 4:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement