మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం | Ban Extend on Maoist Party in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం

Aug 8 2013 7:06 PM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం - Sakshi

మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం

భారత కమ్యూనిస్టు(మావోయిస్టు)పార్టీతో పాటు, అనుబంధ ఆరు సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

భారత కమ్యూనిస్టు(మావోయిస్టు)పార్టీతో పాటు, అనుబంధ ఆరు సంఘాలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది పొడిగించిన నిషేధ ఉత్తర్వుల గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 2014 ఆగస్టు 17 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.

మావోయిస్టు పార్టీతోపాటు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రివల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎస్‌ఎఫ్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ), రైతు కూలీ సంఘం(ఆర్‌సీఎస్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లపై నిషేధం విధిస్తూ ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పీకే.మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement