బాలాపూర్‌ గణపయ్య లడ్డూ మనదే

Balapur Ganesh Laddu From Thapeswaram East Godavari - Sakshi

ఎనిమిదేళ్లుగా తాపేశ్వరం నుంచి కానుకగా అందజేస్తున్న హనీ ఫుడ్స్‌

తూర్పుగోదావరి, తాపేశ్వరం (మండపేట): రికార్డు స్థాయిలో వేలం జరిగే హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణపయ్య లడ్డూ తాపేశ్వరం నుంచే వెళుతోంది. ఎనిమిదేళ్లుగా తాపేశ్వరంలో హనీ ఫుడ్స్‌ అధినేత దేవు ఉమామహేశ్వరరావు స్వామివారికి కానుకగా అందజేస్తున్నారు. తేనెలొలికే మడత కాజాలకు పేరొందిన తాపేశ్వరం గ్రా మం గణేష్‌ లడ్డూల తయారీలోను గిన్నీస్‌ రికార్డుల ద్వారా విశ్వవిఖ్యాతమైన విషయం విదితమే. వినా యక చవితి సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఉభయ రాష్ట్రాలకు చెందిన ఉత్సవ కమిటీలు తాపేశ్వరం నుంచి లడ్డూలు తీసుకువెళుతుంటారు. హైదరాబాద్‌లోని బాలాపూర్‌ గణపయ్య లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధరను దక్కించుకుంటూ ఖ్యాతి గాంచింది.

బాలాపూర్‌ గణపయ్యకు తాపేశ్వరంలోని హనీ ఫుడ్స్‌ అధినేత ఉమామహేశ్వరరావు లడ్డూను కానుకగా అందజేస్తున్నారు. రెండు కిలోల వెండి గిన్నెలో 20 నుంచి 25 కిలోల లడ్డూను తయారు చేసి తమ సంస్థ తరుఫున స్వామివారికి అందజేస్తున్నామని,ఎనిమిదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు.  22 కిలోల బరువు గల ఈ లడ్డూను దక్కించుకునేందుకు సంపన్న వర్గాల వారు వేలంలో పోటీ పడుతుంటారు. గతేడాది దాదాపు రూ. 14.7 లక్షలకు వేలంలో భక్తుడు దక్కించుకున్నారన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూను గురువారం స్వామివారికి సమర్పించనున్నట్టు ఉమామహేశ్వరరావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top