శ్రీకన్య థియేటర్‌పై దాడి | attack on the theater srikanya | Sakshi
Sakshi News home page

శ్రీకన్య థియేటర్‌పై దాడి

Jul 10 2015 12:28 AM | Updated on Sep 3 2017 5:11 AM

శ్రీకన్య థియేటర్‌పై దాడి

శ్రీకన్య థియేటర్‌పై దాడి

కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేన్యూకాలనీ శ్రీకన్య థియేటర్‌పై దాడిచేసి అద్దాలను ధ్వంసం చేశారు.

తాటిచెట్లపాలెం(విశాఖ):  కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేన్యూకాలనీ శ్రీకన్య థియేటర్‌పై దాడిచేసి అద్దాలను ధ్వంసం చేశారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ సంఘటన జరిగినట్టు థియేటర్ మేనేజర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. పదిహేను రోజులక్రితం తాము ఈ సినిమా ప్రదర్శన చేపడదామనుకుని తొలుత అనుకున్నా  నాలుగురోజుల క్రితమే నిర్ణయాన్ని వెనక్కుతీసుకుని చిత్రప్రదర్శన నిలిపివేస్తున్నట్టు ప్రకటించమన్నారు. నాలుగు ఆటోల్లో దాదాపు 15మంది దుండగులు వచ్చి థియేటర్‌పై మూడు వైపులనుంచి రాళ్లవర్షం కురిపించి అద్దాలను ధ్వంసం చేశారని తెలిపారు.

 థియేటర్ల వద్ద గట్టి బందోబస్తు
 బాహుబలి ఆడుతున్న థియేటర్ల వద్ద వి ధ్వంసకర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జనార్దన్ నివాస్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 50రూపాయిలకు పైబడిన టికెట్లను ఆన్‌లైన్లోనే అమ్మాలని థియేటర్ల యజమానులకు సూచించామన్నారు. థి యేటర్ల యజమానులతో చర్చించామన్నారు. 20,30, 40 రూపాయిల టికెట్లను థియేటర్లలోనే అమ్ముతారని జేసీ తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement