అట్రాసిటీ కేసులో ఆరుగురి అరెస్టు | atrocity case on six members | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులో ఆరుగురి అరెస్టు

Nov 26 2013 7:02 AM | Updated on Sep 2 2017 1:00 AM

మండల పరిధిలోని బండిపాడు గ్రామానికి చెందిన ఆరుగురిని అట్రాసిటీ కేసులో అరెస్టు చేసినట్లు కామేపల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపారు.

కామేపల్లి, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని బండిపాడు గ్రామానికి చెందిన ఆరుగురిని అట్రాసిటీ కేసులో అరెస్టు చేసినట్లు కామేపల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బండిపాడుకు చెందిన జాటోత్ మంగ్తు, అదే గ్రామానికి చెందిన వేగినాటి రామారావు పొలం వద్ద గత నెల 9న గొవడపడ్డారు. దీంతో మంగ్తుపై వేగినాటి రామారావు, కానబోయిన బిక్షం, కొల్లి శ్రీకాంత్‌తో పాటు మరో ముగ్గురు దాడి చేసి కులం పేరుతో దూషించారు. మంగ్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
 వేర్వేరు కేసుల్లో ముగ్గురు...
 ఎర్రుపాలెం: వేర్వేరు కేసుల్లో ముగ్గురిని సోమవారం అరెస్టుచేసి మధిర కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై టి.సురేష్ తెలిపారు.  మండలంలోని మామునూరు గ్రామంలో ఇటీవల చోరీకి గురైన రెండు విద్యుత్ మోటార్లున కొనుగోలు చేసిన కేసులో కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గంధసిరి వెంకన్న(45) అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలోని కాచారంగ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అదే గ్రామానికి చెంది న మస్తాన్(40)ను, మండలంలోని రాజులదేవరపాడులో  మోటారుసైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన ఏడూరి అప్పిరెడ్డి(20)ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
 బ్యాటరీలు అపహరించిన కేసులో...
 ముదిగొండ : వాహనాల బ్యాటరీలను అపహరించి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో విక్రయించేందుకు తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై జంగం నాగేశ్వరరావు తెలిపారు. ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం... వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిలక కోయలపాడుకు చెందిన ఊడుగుల మహేష్, షేక్ చాంద్‌పాషా, జోగి ప్రశాంత్, ఊడుగుల పాపయ్య ముఠా గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముది గొండ, ఖమ్మం రూరల్ మండలంలోని క్వారీలు, గ్రానైట్ ప్యాక్టరీల్లోని టిప్పర్లు, పొక్లైయిన్లు, ట్రాక్టర్లు, లారీల నుం చి బ్యాటరీలను దొంగిలించారు. 28 బ్యాటరీలను ఆటో లో వల్లబికి తరలించారు. అక్కడినుంచి జగ్గయ్యపేటకు వెళ్లడానికి బస్టాండ్‌సెంటర్‌లో ఉన్నారనే సమాచారం మే రకు పోలీసులు అక్కడిని చేరుకుని నలుగురిని అరెస్టు చేశారు. వారినుంచి బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement