
ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏఆర్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ గురువారం ఆర్థరాత్రి తన వద్దనున్న గన్తో తనకు తాను కాల్చుకున్నాడు. దాంతో అతడు రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఎస్పీ కార్యాలయం సిబ్బంది వెంటనే స్పందించి రాజేశ్వరరావును నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రాజేశ్వరరావు అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగానే రాజేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.