ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన

APSRTC Announced Special Buses From Ap To Different Places On Dussehra Occasion  - Sakshi

సాక్షి, అమరావతి : దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ... హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నుంచి 110, బెంగుళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 బస్సు సర్వీసులను ఏపీకి నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

కాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో ...బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో పండుగలకు స్వస్థలాలకు వెళ్లేవారు...అందుబాటులో ఉన్న బస్సులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణలో రెండోరోజు మరింత తీవ్రతరం కావడంతో పండుగ పూట ప్రయాణికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో శనివారం ఇమ్లీబన్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్ల నుంచి ఏపీ బస్సులు సేవలందిసున్నట్లు తెలిపారు. దాదాపు 2 వేల మేర బస్సులు అదనంగా వచ్చాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి కొంత ఊరట లభించింది. మరో ఐదారు రోజుల పాటు ఏపీ బస్సులు తిరగనున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top