సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. పరిపాలన కారణాల వల్ల పరీక్ష తేదీలను మార్చినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల వివరాలు...
| పరీక్ష పేరు | మారిన తేదీ |
| అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ | నవంబర్ 4, నవంబర్ 5 |
| జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు | నవంబర్ 5, నవంబర్ 6 |
| ఏపీ మైనింగ్ సర్వీస్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్స్ | నవంబర్ 5 |
| హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్లు | నవంబర్ 26 |
| ఏపీ సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు | నవంబర్ 26 |


