నేటి నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు

Appreciated Decision Taken By CM Jagan - Sakshi

సాక్షి, కృష్ణా : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా  పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తానని జగన్‌ మోహన్‌ రె‍డ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంవత్సరంలో 365 రోజులూ కష్టపడే పోలీసులకు వారాంతపు సెలవులను ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచే అమలు కానున్నాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.

నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పోలీసు శాఖలో వారాంతపు సెలవులు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తొలి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా 277 మంది సెలవు తీసుకున్నారని, ఈ వీక్లీ ఆఫ్‌ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ వారంతపు సెలవుల విషయంలో ఎటువంటి ఇబ్బంది రానివ్వమని, ఉన్న సిబ్బందితోనే పోలీసు సేవలను కొనసాగిస్తామని పేర్కోన్నారు. రాష్ట్రంలో పని ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు వారాంతపు సెలకు కొంత ఊరటనిస్తుందని, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top