చర్చించేందుకు వస్తే అడ్డుకుంటారా? | APNGO former activists angry on Ashok Babu | Sakshi
Sakshi News home page

చర్చించేందుకు వస్తే అడ్డుకుంటారా?

Dec 14 2013 1:26 AM | Updated on Sep 2 2017 1:34 AM

ఏపీఎన్జీవో భవన్‌లో అశోక్‌బాబుతో చర్చించేందుకు వచ్చిన సుబ్బరాయన్ వర్గీయులను అశోక్‌బాబు అనుచరులు అడ్డుకున్నారు.

అశోక్‌బాబు వైఖరిపై సుబ్బరాయన్ విమర్శ

ఏపీఎన్జీవో భవన్‌లో అశోక్‌బాబుతో చర్చించేందుకు వచ్చిన సుబ్బరాయన్ వర్గీయులను అశోక్‌బాబు అనుచరులు అడ్డుకున్నారు. దాంతో ఏపీఎన్జీవో కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిగ్గీ రాజాను అడ్డుకోవడంతో పాటు అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వెళితే తమను అడ్డుకున్నారని ఏపీఎన్జీవోల మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్, సంఘం మాజీ కోశాధికారి జి.సతీష్‌కుమార్ ఆరోపించారు. అసెంబ్లీకి టీ బిల్లు వస్తే సమ్మె చేస్తామని గతంలో అశోక్‌బాబు ప్రకటించారని, మరి సమ్మె ఏమైందని వారు ప్రశ్నించారు. గతంలో 66 రోజుల సమ్మెలో తాము కూడా పాల్గొన్నామని, ఇప్పుడు మాత్రం తమను రావద్దంటూ అశోక్‌బాబు అనుచరులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం అందరూ ఒక వేదిక మీదకు వస్తున్నప్పుడు.. తాము వస్తే అశోక్‌బాబుకు వచ్చే ఇబ్బందేమిటని నిలదీశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement