మార్చి 31 నుంచి టెన్త్ పరీక్షలు

ఏప్రిల్ 17 వరకు పరీక్షల నిర్వహణ
156 ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు
638 సీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు
విద్యా శాఖ మంత్రి సురేశ్ వెల్లడి
సాక్షి, అమరావతి/మార్కాపురం: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వాయిదా వేసినట్టు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ పరీక్షలను ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహిస్తామన్నారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన స్వగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 638 సీ (పోలీస్‌స్టేషన్లకు దూరంగా ఉండేవి) కేంద్రాల్లో సీసీ కెమెరాలను పెడుతున్నామన్నారు. అలాగే 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చి 14 నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి