‘విండ్‌పవర్‌ కొనుగోలు నిలిపివేయలేదు’

AP Power Department Secretary Srikanth Says Wind Power purchase has not stopped - Sakshi

సాక్షి, అమరావతి : విండ్‌పవర్‌ కొనుగోలు నిలిపివేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఎన్‌. శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయని, దీంతో ఉత్పత్తి తగ్గిందన్నారు. గాలి వీచే వేగాన్ని బట్టి విండ్‌ పవర్‌ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు వల్ల ఉత్పత్తిలో భారీ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయని తెలిపారు.  రాష్ట్రంలో సుమారు 4 వేల మెగావాట్ల విండ్‌ పవర్‌ సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 40 మెగావాట్లు మాత్రమే వస్తుందన్నారు. థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తిని స్థిరీకరించడానికి ముమ్మర చర్యలు చేపట్టామని శ్రీకాంత్‌  వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top