రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఏపీ గవర్నర్‌

AP Governor Biswabhusan Harichandan Launched Blood Donation Camp In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ  : రక్తదానంపై యువకులు, విద్యార్థులు మరింత స్పూర్తి నింపుతూ  ప్రజలకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లయోలా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వల్ల ఎంతో ప్రాణాలను రక్షించగలుతామన్నారు. పెద్దమొత్తంలో విద్యార్థులు తరలివచ్చి రక్త దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరుతుందని ప్రశంసించారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన సమయంలో సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుందని కొనియాడారు. రక్తదానంపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. సమానత్వం సాధించేలా యువత కృషి చేయాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top