డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా దారుణం | AP DSC 2018: Notification release date postponed | Sakshi
Sakshi News home page

డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా దారుణం

Oct 12 2018 11:34 AM | Updated on Mar 28 2019 5:27 PM

AP DSC 2018: Notification release date postponed - Sakshi

తిరుపతి కల్చరల్‌: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించి, పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం  మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా  డివైఎఫ్‌ఐ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి.చిన్నబాబు, నగర కార్యదర్శి కె.సుమన్‌ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఐదోసారి కూడా వాయిదా వేయడం దారుణమన్నారు. 

నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న అభ్యర్థుల నోటిలో మట్టికొట్టారని విమర్శించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి తరువాత విస్మరించిందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేస్తారన్న నమ్మకంతో  అభ్యర్థులు  కోచింగ్‌ సెంటర్లకు వేలకువేలు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, రాష్ట్రంలోనున్న ఖాళీ పోస్టులను తక్షణమే  విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  లేనిపక్షంలో  పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు జాఫర్‌ సాదిక్, వీరాంజనేయులు, విశ్వనాథ్, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement