ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు | AP CM YS Jagan Mohan Reddy Gets Diplomatic Passport | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు

Jul 21 2019 1:23 AM | Updated on Jul 21 2019 1:23 AM

AP CM YS Jagan Mohan Reddy Gets Diplomatic Passport - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్‌ పాస్‌పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ ప్రత్యేక పాస్‌పోర్టును ఇచ్చింది. ఇప్పటివరకు సాధారణ పాస్‌పోర్టు కలిగిన ఆయనకు తదుపరి విదేశీ పర్యటనల్లో ప్రొటోకాల్‌ను వర్తింప చేసేందుకు డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి శనివారం వెళ్లారు. పాస్‌పోర్టు జారీకి అవసరమైన వేలిముద్రలు, ఇతర వివరాలను అక్కడి అధికారులకు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement