నోట్ల రద్దుపై బాబు టెలీ కాన్ఫరెన్స్‌ | ap cm chandra babu tele conference from delhi over currency demonetization | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై బాబు టెలీ కాన్ఫరెన్స్‌

Nov 10 2016 5:43 PM | Updated on Sep 22 2018 7:57 PM

నోట్ల రద్దుపై బాబు టెలీ కాన్ఫరెన్స్‌ - Sakshi

నోట్ల రద్దుపై బాబు టెలీ కాన్ఫరెన్స్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు నోట్ల రద్దుపై జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అమరావతి: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

బ్యాంకుల వద్ద షామియానాలు, మంచినీటి వసతి, పోలీసు బందోబస్తుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సహకార రంగంలోని సూపర్ బజార్లతో పెద్ద నోట్లను అనుమతించాలని సూచించారు. రైతు బజార్లతో కూడా పెద్ద నోట్లను అనుమతించే విషయమై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రజలు కూడా సహకరించాలని బాబు కోరారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఇందుకోసం వర్తక సంఘాల ప్రతినిధులను ఒప్పించాలని సీఎం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement