
సాక్షి, అమరావతి : ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రతి నెలా రెండు, నాలుగు బుధవారాల్లో కేబినెట్ సమావేశం కానుంది. అయితే బుధవారం సెలవు దినమైతే మరుసటి రోజు సమావేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఒకటి, మూడు శనివారాల్లో శాఖల వారీగా ప్రతిపాదనలు తెలపాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.