ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని, రానున్న 48 గంట ల్లో ఇది స్పష్టమైన అల్పపీడనంగా మారవచ్చని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
సాక్షి, విశాఖపట్నం : ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని, రానున్న 48 గంట ల్లో ఇది స్పష్టమైన అల్పపీడనంగా మారవచ్చని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు, 20న చెదురుమదురు జల్లులు పడనున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కోస్తాలోని కావలి, నెల్లూరులో అత్యధికంగా 7 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 6, తడలో 5, శ్రీహరికోట, గూడూరులలో 4, సూళ్లూరుపేట చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోని సత్యవేడు, శ్రీకాళహస్తిలో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.