14న అష్టబంధన మహాకుంభాభిషేకం 

Anniversary Celebrations At Sharada Peetham In Vishakhapatnam From February 10 - Sakshi

ఈ నెల 10 నుంచి విశాఖ  శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు

తెలంగాణ, యూపీ సీఎంలు కేసీఆర్, యోగి రాక 

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడి

పెందుర్తి: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ క్షేమం కోరుతూ విశాఖ శ్రీశారదాపీఠంలో ఈ నెల 14న అష్టబంధన మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 5 రోజుల పాటు పీఠం వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో గురువారం స్వామీజీ మాట్లాడుతూ... శారదాపీఠం లో సుధా దేవాలయం(రాజశ్యామల అమ్మవారి దేవాలయం) పునఃప్రతిష్ఠలో భాగంగా శిలా దేవాలయాన్ని నిర్మించామని, ఈ నెల 10న దేశం నలుమూలల నుంచి వచ్చే పండితుల చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనతో పాటు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయని వెల్లడించారు.

తొలిరోజు గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం ప్రారంభం, వాల్మికీ రామాయణం, దేవీ భాగవత పారాయణాలు, మేధా దక్షిణామూర్తికి పంచామృతాభిషేకా లు, రుగ్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృ తిక కార్యక్రమాలు, రెండో రోజు దాసాంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, రాజశ్యామల యాగం, వనదుర్గ యాగం, నీరాజన మంత్రపుష్పం, కృష్ణ యజుర్వేద పారాయణం, నిత్య పీఠ పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.  తెలం గాణ  సీఎం కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని స్వామీజీ చెప్పారు. సమావేశంలో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top