మళ్లీ వెలుగులోకి వచ్చిన రిషితేశ్వరీ కేసు

Andhrapradesh High Court transfers Rishiteshwari Case to POCSO Court - Sakshi

సాక్షి, అమరావతి: ఐదేళ్ల తరువాత రిషితేశ్వరీ ఆత్మహత్య కేసు మళ్లీ తెర మీదకి వచ్చింది. ర్యాగింగ్‌ కారణంగా వేధింపులు ఎదుర్కొవడంతో ఆర్టిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ర్యాగింగ్‌ ఎదుర్కొనే సమయానికి రిషితేశ్వరీ మైనరే కాబట్టి తిరిగి ఈ కేసుపై విచారణ జరిపి పోక్సోచట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసులకోవాలని పోక్సోకోర్టుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రిషితేశ్వరీ మేజర్ కావడంతో గతంలో విచారణకు పోక్సో న్యాయస్థానం అంగీకరింలేదు. అయితే పోక్సోచట్టం తీరును హైకోర్టు తప్పుబట్టింది. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం)

వేధింపులు ఎదుర్కున్న సమయంలో ఆమె మైనరే కాబట్టి ఈ కేసు ఫోక్సో చట్టం కిందకే వస్తుందని, ఫోక్సో చట్టం కిందే నిందుతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలోని హాస్టల్‌ గదిలో రిషితేశ్వరీ సీనియర్ల ర్యాంగింగ్‌ కారణంగా ఆత్మహత్యకి పాల్పడింది. రిషితేశ్వరీ పై చరణ్ నాయక్, ఎన్.శ్రీనివాస్, నాగలక్ష్మి వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో వారిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై రిషితేశ్వరీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న కారణంగా పోలీసులు కాలేజీ ప్రిన్సిపాల్‌ బాబురావుపైనా కూడా కేసు నమోదు చేశారు. దీనిపై 2016 జనవరి 7న పోక్సోకోర్టు విచారణ చేపట్టింది. (టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని నమ్మొద్దు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top