గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు రాజ్యాంగ విరుద్ధం

Telangana High Court Verdict On Private Corona Hospitals and Labs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు, చికిత్సలపై తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు పేర్కొంది. ప్రైవేట్‌ కేంద్రాల్లోనూ డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోవడం ప్రజల హక్కు అని కోర్టు తెలిపింది. (త్రీస్టార్.. తిరుపతి వన్)

ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతినిచ్చారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేట్‌ ఆసుపత్రలు, ల్యాబ్‌లు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోర్టు కోరింది. ఆస్పపత్రులు, ల్యాబ్‌లలో వైద్యసిబ్బంది, సదుపాయాలను ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని కోర్టు ఆదేశించింది. ఐపీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.   

(విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top