ఏపీకి రెండు జాతీయ అవార్డులు | Andhra Pradesh Gets Two Awards In Poshan Abhiyan Implementation | Sakshi
Sakshi News home page

ఏపీకి పోషణ్‌ అభియాన్‌ జాతీయ అవార్డులు

Aug 24 2019 6:57 AM | Updated on Aug 24 2019 6:57 AM

Andhra Pradesh Gets Two Awards In Poshan Abhiyan Implementation - Sakshi

స్మృతి ఇరానీ చేతుల మీదుగా రూ.కోటి నగదు పురష్కారాన్ని అందుకుంటున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణులు దమయంతి, కృతిక శుక్లా 

ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది. ఇందుకుగాను రూ.కోటి నగదు పురస్కారాన్ని దక్కించుకుంది.

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, శిశుమరణాలను నివారించేందుకుగాను కేంద్రం అమలు చేస్తున్న పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండు జాతీయ అవార్డులు, క్షేత్రస్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ఐసీడీఎస్‌ ప్రోగ్రాం అమల్లో ఏపీ జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది. ఇందుకుగాను రూ.కోటి నగదు పురస్కారాన్ని దక్కించుకుంది.

అదేవిధంగా పోషకాహారం పంపిణీలో ఏపీ రెండో స్థానం పొందింది. ఈ అవార్డులను శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డా.దమయంతి, ఆ శాఖ సంచాలకులు డా.కృతిక శుక్లా అందుకున్నారు. నాయకత్వ విభాగంలో దక్కిన అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, ప్రాజెక్టు స్థాయిలో అనంతపురం జిల్లా శింగనమల సీడీపీవో జి.వనజ అక్కమ్మ, క్షేత్రస్థాయిలో  గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా పుత్తూరు కార్యకర్తలు అవార్డులను అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement