
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలపై శాసనసభలో చర్చ జరుగుతోంది.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలపై శాసనసభలో చర్చ ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టీడీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్షణరావు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. దీంతో పాటు సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై కూడా నేడు మండలిలో చర్చ జరుగనుంది. బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ మండలిలో మంగళవారం ఆయా బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
(చదవండి)
ఐయామ్ సారీ..!
బిల్లులపై మండలిలో రగడ
ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా?