వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపులు

Andhra Pradesh Agriculture Budget 2019 - Sakshi

సాక్షి, అమరావతి : అన్నదాతకు కొండంత భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు నాణ్యమైన పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుదేలవుతున్న వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా, కర్షకుల కష్టాలు దూరం చేసేలా రూ. 28,866.23 కోట్లతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్‌లోని కేటాయింపులు ఈవిధంగా ఉన్నాయి.

వ్యవసాయ బడ్జెట్‌ ప్రధానాంశాలు

  • రెవెన్యూ వ్యయం రూ. 27,946.65 కోట్లు
  • పెట్టుబడి వ్యయం రూ. 919.58 కోట్లు
  • వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు రూ.3,223 కోట్లు
  • రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ. 4,525 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు
  • ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
  • వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాకు రూ. 1163 కోట్లు
  • వైఎస్సార్‌ రైతు బీమాకు రూ. 100 కోట్లు
  • ప్రమాద వశాత్తు రైతు చనిపోతే రూ. 7 లక్షల సాయం
  • ఉద్యాన శాఖకు రూ.1532 కోట్లు
  • ఆయిల్‌ఫాం ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు రూ. 80 కోట్లు
  • ఆయిల్‌ఫాం తోటల సాగు ప్రోత్సాహకానికి రూ.65.15 కోట్లు
  • ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ. 200 కోట్లు
  • బిందు, తుంపర సేద్య పథకాలకు రూ. 1105.66 కోట్లు
  • సహకార రంగ అభివృద్ధి కోసం రెవెన్యు వ్యయం రూ.174.64 కోట్లు
  • సహకార రంగ అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ. 60 కోట్లు
  • ప్రతి రైతు కుటుంబానికి వైఎ‍స్సార్‌ భరోసా కింద రూ. 12,500
  • 2019-20లో రైతులకు స్వల్పకాలిక రుణాల కింద రూ. 12 వేల కోట్లు
  • 2019-20లో రైతులకు దీర్ఘ కాలిక రుణాల కింద రూ.1500 కోట్లు
  • పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.158 కోట్లు
  • పశు సంవర్ధక శాఖ అభివృద్ధికి రూ.1778 కోట్లు
  • పాడి పరిశ్రమకు రూ. 100 కోట్లు
  • గొర్రెల బీమా పథకం కింద గొర్రె మరణిస్తే రూ. 6 వేలు
  • పశువు మరణిస్తే బీమా పథకం కింద రూ. 30 వేలు
  • పశుగ్రాసం కోసం రూ. 100 కోట్లు
  • పశు టీకాల కోసం రూ. 25 కోట్లు
  • కోళ్ల పరిశ్రమ నిర్వాహకుల కోసం రూ. 50 కోట్లు
  • నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రూ. 10 వేలకు పెంపు
  • వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోతే కుటుంబానికి రూ.10 లక్షలు
  • ఆహార భద్రత మిషన్‌కు రూ.141 కోట్లు
  • వ్యవసాయ మౌలిక వసతులకు రూ. 349 కోట్లు
  • రైతులకు రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు
  • భూసార పరీక్షల నిర్వహణకు రూ. 30 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ. 420 కోట్లు
  • జీరో బడ్జెట్‌ వ్యవసాయానికి రూ.91 కోట్లు
  • చదవండి: ఏపీ బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top