ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ లాకౌట్ | Andhra Ferro allayis lockout | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ లాకౌట్

Nov 9 2014 1:54 AM | Updated on Aug 18 2018 4:27 PM

మండలంలోని గర్భాం ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమను శనివారం రాత్రి నుంచి మూసివేశారు. మొన్నటివరకు విద్యుత్ సరఫరా లేక.. ఇప్పుడు కార్మికుల సమస్యలను

 గర్భాం (మెరకముడిదాం) :మండలంలోని గర్భాం ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమను శనివారం రాత్రి నుంచి మూసివేశారు. మొన్నటివరకు విద్యుత్ సరఫరా లేక.. ఇప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరించలేక యాజమాన్య పరిశ్రమను మూసివేసింది. కొన్ని నెలల క్రితం గరివిడి ఫేకర్ లాకౌట్ కావడంతో అందులోని వందల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమ కూడా లాకౌట్ ప్రకటించడంతో వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే గరివిడి ఫేకర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి మృణాళినికి ఈ పరిశ్రమ లాకౌట్ కూడా మరిన్ని ఇబ్బందులు సృష్టించనుంది.
 
    మండలంలోని గర్భాం ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమను శనివారం రాత్రి నుంచి మూసివేశా రు. పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికలను ఇటీవల యాజమాన్యం తుపానుల కారణంగా విద్యుత్ సరఫరా లేదన్న కారణంతో పది రోజుల వరకూ విధులకు హాజరుకావొద్దని తెలిపింది. అయితే దీనికి కార్మికులు తొలుత ఒప్పుకోలేదు. యాజమాన్యం చెప్పినట్టుగా పది రోజుల్లో విద్యుత్ సరఫరా వస్తే పరవాలేదని, ఒకవేళ విద్యుత్  సరఫరా కాకపోయినా తమను విధుల్లోకి తీసుకుంటామని అగ్రిమెంట్ రాయాలని కాంట్రాక్ట్ కార్మికులకు చెందిన నాయకలు ఎస్.వెంకటపతిరాజు, రెడ్డి లక్ష్మణ, రౌతు కృష్ణ, తాడ్డె వేణుగోపాలరావు, కిరణ్‌కుమార్, జన, కళ్యాణి శ్రీను తదితరులు యాజమాన్య ప్రతినిధులను కోరారు.
  దీనికి యాజమాన్య ప్రతినిధులు ఒప్పుకున్నారు.
 
 అయితే కొద్దిరోజులు వరకూ విద్యుత్ సరఫరా కాకపోవడంతో మళ్లీ యాజమాన్యం విద్యుత్ సరఫరా కాలేదని, అందుకని విధులకు హాజరుకావొద్దని కాంట్రాక్ట్ కార్మికులకు తెలిపారు. ఇలా చెప్పిన రెండు రోజుల్లోనే పరిశ్రమకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కావడం తో ఇప్పుడు కార్మికులు...తమకు విధులకు రావొద్దని చెప్పిన రోజులకు కలిపి వేతనాలు, అలాగే పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా యాజమాన్యం బాధ్యత వహించాలని, ప్రతి నెలా 10 వతేదీ లోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరిస్తేనే తాము విధులకు హాజరవుతామని, లేకపోతే సమ్మె చేస్తామని తెలి పారు. ఈ మేరకు యాజమాన్యం ప్రతినిధులు జేఎండీ నిమ్మిఖం డేల్‌వాల్, జీఎం మూర్తి కార్మిక సంఘ నేతలతో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు విఫలం కావడంతో యాజమాన్యం లా కౌట్ వైపు మగ్గు చూపింది. ఈ మేరకు శనివారం రాత్రి 8. 30 గంటలకు లాకౌట్ ప్రకటించింది. దీంతో పరిశ్రమలో పని చేస్తున్న 700 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement