అనంత ఏటీఎంలో నోట్ల వర్షం.. | anantapur sbi atm technical problem gives more cash | Sakshi
Sakshi News home page

అనంత ఏటీఎంలో నోట్ల వర్షం..

Jan 24 2017 10:53 AM | Updated on Sep 5 2017 2:01 AM

అనంత ఏటీఎంలో నోట్ల వర్షం..

అనంత ఏటీఎంలో నోట్ల వర్షం..

పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు ఏటీఎంలు డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి.

గుంతకల్లు: దేశంలో ఏటీఎంలు డబ్బుల వర్షం కురిపిస్తున్నాయి. రాజస్థాన్‌, అసోం ఏటీఎంల్లో విత్‌ డ్రా చేసిన డబ్బు కంటే ఎక్కువ మొత్తం వచ్చిన ఘటనలు మరువక ముందే అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

గుంతకల్లు పట్టణంలో సోమవారం రాత్రి ఎస్‌బీఐ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఖాతాదారులు రూ.3 వేలు విత్‌ డ్రా చేస్తే రూ.6వేలు, అంతకు మించి కూడా డబ్బులు వచ్చాయి. దీంతో ఖాతాదారులు ఆనందంగా వచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఓ ఖాతాదారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు బ్యాంకు అధికారులకు తెలిపారు. అధికారులు ఏటీఎంను పరిశీలించి మూసివేశారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఏ ఖాతాదారుడు ఎంత తీసుకున్నారనేది సర్వర్‌లో నమోదవుతుందని, ఆ వివరాలు సేకరించి వారు తీసుకున్న డబ్బును తిరిగి తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement