గిరిజనులను ఆదుకుంటాం | Among the tribal people - cm chandra babu | Sakshi
Sakshi News home page

గిరిజనులను ఆదుకుంటాం

Jul 16 2014 2:08 AM | Updated on Jul 28 2018 3:23 PM

గిరిజనులను ఆదుకుంటాం - Sakshi

గిరిజనులను ఆదుకుంటాం

పోలవరం ముంపు ప్రాంత గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంత  గిరిజనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్నారు. నీటిరంగ నిపుణుడు, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఎల్.రావు 112వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అమీర్‌పేట కమ్మసంఘం హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పోలవరానికి జాతీయ హోదా రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 నేటి నుంచి సీఎం రెండు రోజుల పర్యటన: చంద్రబాబు బుధవారం నుంచి రెండు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement